UP student: రైల్వేపై ఏడేళ్లు పోరాడి గెలిచిన యూపీ విద్యార్థిని.. ఏం జరిగిందంటే..!

UP Student Samriddhi to get 91 Lakh compensation for train delay
  • రైలు ఆలస్యంగా రావడం వల్ల పరీక్ష రాయలేకపోయిన విద్యార్థిని
  • విలువైన అకడమిక్ ఇయర్ కోల్పోయానంటూ రైల్వేపై కేసు
  • 20 లక్షల పరిహారం కోరిన విద్యార్థిని.. సుదీర్ఘ న్యాయ పోరాటం
  • 45 రోజుల్లో 9.10 లక్షల పరిహారం చెల్లించాలని రైల్వేకు వినియోగదారుల కమిషన్‌ ఆదేశాలు
రైలు ఆలస్యంగా నడవడం వల్ల పరీక్ష రాయలేకపోయానని, తన కెరీర్ లో ఏడాది కాలం వృథా అయిందని ఓ విద్యార్థిని రైల్వేపై న్యాయపోరాటం చేసింది. ఏడేళ్ల పాటు సుదీర్ఘ విచారణ తర్వాత కేసు గెలిచి, 9.10 లక్షల పరిహారం అందుకోనుంది. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..

ఉత్తర్‌ప్రదేశ్‌ లోని బస్తీ జిల్లాకు చెందిన సమృద్ధి అనే యువతి 2018లో బీఎస్సీ బయోటెక్నాలజీ ప్రవేశ పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేసుకుంది. కష్టపడి చదివి ప్రవేశ పరీక్షకు సిద్ధమైంది. అయితే, పరీక్ష కేంద్రం లఖ్ నవూలో ఉండడంతో సూపర్ ఫాస్ట్ రైలుకు టికెట్ రిజర్వేషన్ చేసుకుంది. తీరా పరీక్ష రోజు ఆ రైలు ఆలస్యంగా నడవడంతో సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోలేక పోయింది. ఉదయం 11 గంటలకు లఖ్ నవూ చేరుకోవాల్సిన ఆ రైలు మధ్యాహ్నం 1:30 కు చేరింది.

మధ్యాహ్నం 12:30 గంటలకు పరీక్ష మొదలవడంతో సమృద్ధి హాజరుకాలేక పోయింది. దీనిపై ఆమె జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించింది. తనకు జరిగిన నష్టానికి రూ.20 లక్షల పరిహారం ఇప్పించాలని కోరింది. ఏడేళ్ల పాటు జరిగిన సుదీర్ఘ విచారణ తర్వాత తాజాగా ఆమెకు అనుకూలంగా కమిషన్ తీర్పు వెలువరించింది. రైలు ఆలస్యం వల్ల సమృద్ధికి వాటిల్లిన నష్టానికి గానూ రూ.9.10 లక్షల పరిహారాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని రైల్వే శాఖకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
UP student
Railway compensation
Train delay
Basti district
Lucknow exam
Consumer Commission
Railway negligence
Exam missed
Career loss

More Telugu News