నేడు తాడేపల్లికి వైఎస్ జగన్
- ఈ రోజు ఉదయం 11.50 గంటలకు బెంగళూరు నుంచి గన్నవరం చేరుకోనున్న జగన్
- రోడ్డు మార్గంలో 12.30 గంటలకు తాడేపల్లి నివాసానికి
- రేపు నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహించనున్న జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం లక్ష్యంగా వారానికి ఒకరోజు నేతలు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించాలని ఇదివరకే నిర్ణయించిన వైఎస్ జగన్ గత బుధవారం ఏలూరు నియోజకవర్గ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో రేపు బుధవారం కూడా నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.
ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం బెంగళూరు నుంచి విమానంలో బయలుదేరిన వైఎస్ జగన్ 11.50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 12.50 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి జగన్ చేరుకుంటారు. కాగా, ఈ రోజు సాయంత్రం ముఖ్య నేతలతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
.