Bandla Ganesh: బండ్ల గణేశ్‌ను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్

Minister Nara Lokesh consoles producer Bandla Ganesh
  • తిరుమలకు కాలినడకన బయలుదేరిన బండ్ల గణేశ్
  • చంద్రబాబు అరెస్టై జైలుకు వెళ్లిన సమయంలో తిరుమల వెంకన్నకు కాలినడకన వస్తానని మొక్కుకున్నానన్న బండ్ల గణేశ్
  • పాదయాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించి త్వరగా కోలుకుని మొక్కు పూర్తి చేయాలని ఆకాంక్షించిన లోకేశ్
సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. శ్రీవారి మొక్కు తీర్చుకునేందుకు తిరుమలకు పాదయాత్ర (సంకల్ప యాత్ర) చేపట్టిన బండ్ల గణేశ్ కాలి నొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న లోకేశ్ ఆయనతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. పాదయాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి త్వరగా కోలుకుని మొక్కు పూర్తి చేయాలని ఆకాంక్షించారు. 

వైసీపీ హయాంలో టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టైన సమయంలో తాను తిరుమల వెంకన్నకు మొక్కుకున్నానని బండ్ల గణేశ్ తెలిపారు. అనంతరం చంద్రబాబు జైలు నుంచి విడుదలై ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి సీఎం పదవిని చేపట్టడంతో, ఆ మొక్కును తీర్చుకునేందుకే ఈ నెల 19న షాద్‌నగర్‌లోని తన నివాసం నుంచి బండ్ల గణేశ్ సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రను చేపట్టారు. 

కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకొని మొక్కు తీర్చుకుంటానని ఆయన తెలిపారు. ప్రస్తుతం బండ్ల గణేశ్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో బండ్ల గణేశ్‌కు మార్గమధ్యలో టీడీపీ అభిమానులు, నేతలు స్వాగతం పలుకుతూ మద్దతు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో లోకేశ్ ఫోన్ చేసి గణేశ్‌ను పరామర్శించారు. 
Bandla Ganesh
Nara Lokesh
TDP
Tirumala
Padayatra
Andhra Pradesh Politics
Chandrababu Naidu
Kurnool
AP Minister

More Telugu News