G Parameshwara: రూ.400 కోట్లతో తిరుపతి రావాల్సిన కంటైనర్ దోపిడీ... స్పందించిన కర్ణాటక హోంమంత్రి

G Parameshwara Reacts to 400 Crore Container Theft near Tirupati
  • గోవా-కర్ణాటక సరిహద్దుల్లోని చర్లకొండ మార్గంలో రూ.400 కోట్లతో తరలిస్తున్న కంటైనర్ దోపిడీ
  • మహారాష్ట్ర పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపిన హోంమంత్రి
  • నాసిక్ ప్రాంతంలో కొంతమంది అనుమానితులను అరెస్టు చేసినట్లు వెల్లడి
రూ. 400 కోట్లను తరలిస్తున్న కంటైనర్‌ను దొంగిలించినట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారని కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర పేర్కొన్నారు. గోవా-కర్ణాటక సరిహద్దుల్లోని చర్లకొండ మార్గంలో రూ. 400 కోట్లను తరలిస్తున్న కంటైనర్‌ను దోపిడీ దొంగలు దారి మళ్లించిన వ్యవహారంపై ఆయన స్పందించారు. బాధితులు కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేయడానికి సిద్ధమని, ఈ ఘటనలో వాస్తవాలు వెలుగు చూస్తాయని ఆయన అన్నారు.

కర్ణాటక సరిహద్దుల్లో దోపిడీ జరగగా, మహారాష్ట్రలోని నాసిక్‌లో కేసు నమోదైంది. కొన్ని రాష్ట్రాల్లో త్వరలో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికలకు ఈ డబ్బు కాంగ్రెస్ పార్టీ తరలిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ కొట్టి పారేస్తోంది. గుజరాత్, మహారాష్ట్ర, గోవాలలో బీజేపీయే అధికారంలో ఉందని కర్ణాటక కాంగ్రెస్ మంత్రులు గుర్తు చేశారు.

కాగా, కర్ణాటక సరిహద్దుల్లో కంటైనర్‌ను దొంగిలించగా, మహారాష్ట్ర పోలీసులు విచారణ జరుపుతున్నారని, దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించినట్లు జి. పరమేశ్వర చెప్పారు. నాసిక్ ప్రాంతంలో కొంతమంది అనుమానితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని ఆయన అన్నారు.

గోవా-కర్ణాటక సరిహద్దుల్లోని చర్లకొండ మార్గంలో రూ. 400 కోట్లను తరలిస్తున్న కంటైనర్‌ను దోపిడీ దొంగలు దారి మళ్లించారు. ఆ వాహనం గుజరాత్ నుంచి మహారాష్ట్ర, గోవా మీదుగా కర్ణాటకలో ప్రవేశించి తిరుపతికి చేరాల్సి ఉంది. దీనిని ఎవరు దారి మళ్లించారనే అంశంపై మహారాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది.

G Parameshwara
Karnataka Home Minister
Container Theft
400 Crore Robbery
Goa Karnataka Border

More Telugu News