సంజూ శాంసన్ అలా ఆడాలనుకుంటున్నాడు... కానీ!: రహానే
- న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో సంజూ పేలవ ప్రదర్శన
- అభిషేక్ శర్మలా దూకుడుగా ఆడాలని ఒత్తిడికి గురవుతున్నాడన్న రహానే
- ప్రపంచ కప్ జట్టులో ఉంటాడని సంజూకు కోచ్ భరోసా ఇవ్వాలని సూచన
భారత ప్రపంచ కప్ జట్టులో చోటు గురించి సంజూ శాంసన్‌కు కోచ్, కెప్టెన్ భరోసా ఇవ్వాలని భారత టెస్ట్ జట్టు మాజీ కెప్టెన్ అజింక్య రహానే అభిప్రాయపడ్డాడు. సంజూ శాంసన్ న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. వరుసగా మూడు టీ20 మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. గౌహతిలో జరిగిన టీ20 మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో రహానే కొన్ని కీలక సూచనలు చేశాడు. సంజూ శాంసన్ పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడని పేర్కొన్నాడు.
సంజూ శాంసన్ ఉత్తమ ప్రదర్శన కనబరచాలంటే కెప్టెన్, మేనేజ్‌మెంట్ పాత్ర ఎంతో ముఖ్యమని రహానే అన్నాడు. అభిషేక్ శర్మలా దూకుడుగా ఆడటానికి ప్రయత్నించి సంజూ శాంసన్ ఒత్తిడికి గురవుతున్నాడని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ కప్ జట్టులో ఉంటావని కోచ్ గౌతమ్ గంభీర్ సంజూకు భరోసా ఇవ్వాలని సూచించాడు. ఇది సంజుకు అండగా నిలవాల్సిన సమయమని అన్నాడు. జట్టులో స్థానానికి ఎలాంటి ఢోకా లేదని చెప్పడం ద్వారా అతనిలో ఉన్న ఆందోళనను తొలగించాలని సూచించాడు.
అభిషేక్ శర్మ మరోవైపు వేగంగా పరుగులు చేస్తుండటంతో, తాను కూడా అలాగే చేయాలని భావించి సంజూ ఒత్తిడికి లోనవుతున్నాడని రహానే తెలిపాడు. సంజు తనపై తాను నమ్మకం కోల్పోకూడదని, తనదైన శైలిలో ఆడాలని సూచించాడు. కాగా, సంజూ శాంసన్‌కు ఇషాన్ కిషన్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.