Pushpa 2: జపనీస్ ఫ్యాన్ అచ్చతెలుగులో మాట్లాడ‌టం చూసి షాకైన బన్నీ, రష్మిక.. ఇదిగో వీడియో!

Allu Arjun Rashmika Amazed by Japanese Fans Telugu
  • పుష్ప 2 ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన అల్లు అర్జున్, రష్మిక 
  • కార్యక్రమంలో ఓ జపనీస్ అభిమాని అచ్చ తెలుగులో సంభాషణ
  • అతని భాషా నైపుణ్యానికి ఆశ్చర్యపోయిన ఐకాన్ స్టార్
  • అభిమానిని చిరునవ్వుతో ప్రశంసించిన రష్మిక మందన్న
  • సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేష‌న‌ల్ క్ర‌ష్‌ రష్మిక మందన్నకు జపాన్‌లో ఊహించని అనుభవం ఎదురైంది. ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించిన 'పుష్ప 2' చిత్రాన్ని ఇటీవల జపాన్‌లో విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం అక్కడికి వెళ్లగా, ఓ జపనీస్ అభిమాని వారిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

ప్రమోషనల్ ఈవెంట్‌లో భాగంగా అల్లు అర్జున్‌, రష్మిక అభిమానులతో ముచ్చటిస్తుండగా, ఓ జపనీస్ అభిమాని అచ్చమైన, స్పష్టమైన తెలుగులో మాట్లాడటం ప్రారంభించాడు. విదేశీయులు సాధారణంగా తెలుగు పదాలు పలకడానికి ఇబ్బంది పడుతుంటారు. కానీ, ఇతను ఏ మాత్రం తడబడకుండా, అచ్చం తెలుగు వాడిలా సరళంగా మాట్లాడటంతో అల్లు అర్జున్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఆ అభిమాని భాషా ప్రావీణ్యం చూసి రష్మిక మందన్న సైతం ఫిదా అయ్యారు. ఆమె చిరునవ్వుతో అతడిని ప్రశంసించారు. తమ సినిమాకు, తమ భాషకు దేశాలు దాటి ఇంతటి ఆదరణ లభించడంపై వారిద్దరూ సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్, రష్మికల రియాక్షన్ చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Pushpa 2
Allu Arjun
Rashmika Mandanna
Japan
Telugu language
Japanese fan
Pushpa promotions
Viral video
Tollywood
Icon Star

More Telugu News