Chandrababu Naidu: గన్నవరం ఎయిర్ పోర్టులో కేంద్రమంత్రిని కలిసిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Meets Union Minister at Gannavaram Airport
విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం చంద్రబాబు
రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం గన్నవరం విమానాశ్రయంలో కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో జరిగిన ఈ భేటీలో ఇరువురు నేతలు స్నేహపూర్వకంగా చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రితో విస్తృతంగా చర్చించారు. కేంద్ర - రాష్ట్రాల మధ్య సమన్వయం, అభివృద్ధి సంబంధిత అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

ఈ సమావేశంలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ సీఎం రమేశ్ పాల్గొన్నారు. 
Chandrababu Naidu
Andhra Pradesh
Arjun Ram Meghwal
Gannavaram Airport
AP BJP
Central Minister
CM Ramesh
Satya Kumar Yadav
Andhra Pradesh Politics
AP Development

More Telugu News