RK Naidu: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన జెండా ఎగురవేస్తాం: నటుడు సాగర్

RK Naidu Janasena flag will fly in Telangana municipal elections
  • పెద్దపల్లి పట్టణంలో జనసేన పార్టీ సమావేశం
  • పాల్గొన్న ప్రచార కార్యదర్శి, నటుడు సాగర్
  • కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్న సాగర్
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయించిన విషయం తెలిసిందే. గత నెలలో తెలంగాణ జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. జనసేన పార్టీ పోటీకి సిద్ధం కావడంతో పలు రాజకీయ పార్టీల నాయకులు సైతం స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయవచ్చని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి పట్టణంలో హరీశ్ గౌడ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, నటుడు సాగర్ (ఆర్కే నాయుడు) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్దపల్లిలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా ఎగరడం తథ్యమని అన్నారు. రాబోయే ఎన్నికలలో తెలంగాణలో జనసేన జెండాను ఎగురవేసి ప్రజలకు అందుబాటులో ఉంటామని ఆయన పేర్కొన్నారు. పార్టీలో కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి సముచిత గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు.

RK Naidu
Janasena
Telangana municipal elections
Telangana
Municipal elections
పెద్దపల్లి
Harish Goud

More Telugu News