Indian Fugitives: 'వాంటెడ్' జాబితాలో ఉన్న వారిలో 70 మంది విదేశాల్లో ఉన్నారు: కేంద్ర ప్రభుత్వం

70 Indian Fugitives Identified Abroad Says Central Government
  • పరారీలో ఉన్న వారి గుర్తించే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుందన్న కేంద్రం
  • ఇతర దేశాలు వెతుకుతున్న 203 మంది నిందితులు భారత్‌లో ఉన్నట్లు వెల్లడి
  • వాంటెడ్ జాబితాలో ఉన్న వారిలో 27 మంది గత ఏడాది తిరిగి వచ్చినట్లు వెల్లడి
గత రెండేళ్లలో 'వాంటెడ్' జాబితాలో ఉన్న వారిలో 70 మంది విదేశాల్లో ఉన్నట్లు గుర్తించామని కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికలో తెలిపింది. వివిధ కేసుల్లో నిందితులుగా ఉండి, పరారీలో ఉన్న వారిని గుర్తించే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుందని వెల్లడించింది. అదే సమయంలో ఇతర దేశాలు వెతుకుతున్న 203 మంది నిందితులు భారత్‌లో ఉన్నారని ఈ నివేదిక పేర్కొంది. పరారీలో ఉన్న వారిని విదేశాల్లో ఇంత పెద్ద మొత్తంలో గుర్తించడం గత దశాబ్ద కాలంలో ఇదే మొదటిసారి అని తెలిపింది.

వాంటెడ్ జాబితాలో ఉన్న వారిలో 27 మంది గత సంవత్సరం విదేశాల నుంచి తిరిగి వచ్చారని భారత ప్రభుత్వం వెల్లడించింది. సీబీఐ కేసులకు సంబంధించి ఏడాది వ్యవధిలో 74 రొగేటరీ లెటర్స్ పంపించినట్లు తెలిపింది. దర్యాప్తునకు సహకరించాలని విదేశీ న్యాయస్థానాలకు రాసే లేఖను రొగేటరీ లెటర్స్ అంటారు. ఈ లేఖల్లో 54 సీబీఐ, మరో 20 రాష్ట్ర దర్యాప్తు బృందాలు రాసినట్లు పేర్కొంది.
Indian Fugitives
Fugitives
India
CBI
Extradition
Rogatory Letters
Crime
Investigation

More Telugu News