Sabarimala Temple: శబరిమల ఆలయంలో సినిమా షూటింగ్ ఆరోపణలు.. స్పందించిన బోర్డు

Sabarimala Temple Movie Shooting Allegations Board Responds
  • ఆరోపణలపై టీడీబీ విజిలెన్స్ విభాగం దర్యాప్తు జరుపుతోందన్న బోర్డు
  • సన్నిధానం ప్రాంతంలో దర్శకుడు అనురాజ్ మనోహర్ వీడియోగ్రఫీ చేసినట్లు ఆరోపణలు
  • సన్నిధానంలో వీడియో తీయలేదని దర్శకుడు చెప్పారన్న బోర్డు
శబరిమల ఆలయంలో సినిమా చిత్రీకరణ జరిగిందన్న వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఆలయ సన్నిధానంలో సినిమా షూటింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు (టీడీబీ) స్పందిస్తూ, వచ్చిన ఆరోపణల నేపథ్యంలో టీడీబీ విజిలెన్స్ విభాగం దర్యాప్తు జరుపుతోందని వెల్లడించింది.

సన్నిధానం ప్రాంతంలో మలయాళ దర్శకుడు అనురాజ్ మనోహర్ వీడియోగ్రఫీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై టీడీబీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, వీడియోగ్రఫీకి అనుమతి కోరుతూ మనోహర్ బోర్డును సంప్రదించారని, అయితే అనుమతి లభించలేదని తెలిపారు. శబరిమల యాత్ర సీజన్‌కు ముందు గుర్తింపు పొందిన మీడియా ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ చిత్రీకరణ వ్యవహారంపై ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తును ప్రారంభిస్తామని తెలిపారు. దర్శకుడు ఎక్కడ చిత్రీకరణ చేశారో తమకు తెలియదని పేర్కొన్నారు. తాను సన్నిధానం ప్రాంతంలో వీడియో తీయలేదని, పంపా నది వద్ద చిత్రీకరణ జరిపానని మనోహర్ చెబుతున్నారని వెల్లడించారు. ముందస్తు అనుమతి లేకుండా సన్నిధానం వద్ద సినిమా షూటింగ్, వీడియోగ్రఫీని నిషేధించినట్లు స్పష్టం చేశారు.
Sabarimala Temple
Travancore Devaswom Board
TDB
Anuraj Manohar
Sabarimala Movie Shooting

More Telugu News