Vikram Bhatt: బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్‌పై మరో చీటింగ్ కేసు.. ఈసారి కుమార్తెతో కలిసి!

Vikram Bhatt Faces New Cheating Case With Daughter
  • విక్రమ్ భట్, కుమార్తె కృష్ణ భట్‌పై రూ.13.5 కోట్ల మోసం కేసు
  • సినిమాల్లో పెట్టుబడుల పేరుతో మోసం చేశారని ఓ వ్యాపారి ఫిర్యాదు
  • ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు 
  • ఇప్పటికే రూ.30 కోట్ల మోసం కేసులో జైల్లో ఉన్న విక్రమ్ భట్
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు విక్రమ్ భట్‌పై మరో భారీ మోసం కేసు నమోదైంది. సినిమాల్లో పెట్టుబడుల పేరుతో తనను రూ.13.5 కోట్లు మోసం చేశారంటూ ఓ వ్యాపారి చేసిన ఫిర్యాదు మేరకు ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో విక్రమ్ భట్‌తో పాటు ఆయన కుమార్తె కృష్ణ భట్‌పైనా కేసు నమోదు చేశారు. ఈ కేసును ఆర్థిక నేరాల విభాగం (EOW) విచారిస్తోంది.

వివ‌రాల్లోకి వెళితే.. సినిమాల్లో, ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి విక్రమ్ భట్, ఆయన కుమార్తె తన నుంచి రూ.13.5 కోట్లు తీసుకుని మోసం చేశారని ఆ వ్యాపారి ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

ఇప్పటికే మరో చీటింగ్ కేసులో జైల్లో విక్రమ్ భట్
ఇప్పటికే విక్రమ్ భట్ మరో చీటింగ్ కేసులో జైలులో ఉన్నారు. రూ.30 కోట్ల మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో గతేడాది డిసెంబర్ 7న ఉదయ్‌పూర్ పోలీసులు విక్రమ్ భట్‌ను, ఆయన భార్య శ్వేతాంబరిని ముంబైలో అరెస్ట్ చేశారు. ఇందిరా ఐవీఎఫ్ యజమాని డాక్టర్ అజయ్ ముర్దియా తన భార్యపై బయోపిక్ తీస్తామని నమ్మించి నిధులు సేకరించి మోసం చేశారని ఫిర్యాదు చేశారు. రూ.7 కోట్ల పెట్టుబడితో నాలుగు సినిమాలు తీసి రూ.100-200 కోట్ల లాభాలు చూపిస్తామని విక్రమ్ భట్ హామీ ఇచ్చినట్లు డాక్టర్ ముర్దియా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో విక్రమ్ భట్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే, ఆయనపై తాజాగా మరో కేసు నమోదు కావడం గమనార్హం.
Vikram Bhatt
Bollywood director
cheating case
Krishna Bhatt
financial fraud
movie investment scam
economic offenses wing
Udaipur police
Ajay Murdia
Shwetambari

More Telugu News