Trump Tariffs: భారత్ పై తగ్గనున్న ట్రంప్ టారిఫ్ లు..!

Donald Trump Tariffs on India likely to decrease
  • భారత్ పై 50 శాతం సుంకాలు వసూలు చేస్తున్న అమెరికా
  • ఇటీవల రష్యా నుంచి కొనుగోళ్లు తగ్గించిన భారత్
  • 25 శాతం టారిఫ్ లు తగ్గించనున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి హింట్
భారత్ పై అమెరికా అధ్యక్షుడు విధించిన టారిఫ్ లు తగ్గించే యోచనలో ఉన్నట్లు అగ్రరాజ్యం సంకేతాలు వెలువరించింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై 25 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ప్రతీకార సుంకాలు 25 శాతం కలిపి మొత్తంగా మన దేశంపై 50 శాతం సుంకాలు విధించారు.

భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తుసేవలపై ట్రంప్ ప్రభుత్వం 50 శాతం సుంకాలు వసూలు చేస్తోంది. అయితే, ఇటీవల రష్యా చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించింది. దీంతో అమెరికా సుంకాలు సగానికి తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Trump Tariffs
India
United States
Russia
Oil imports
Trade
Economy
Scott Bessent

More Telugu News