Mahesh Babu: ఆమె నటన అద్భుతం.. ప్రియాంక చోప్రాపై మహేశ్‌ బాబు ప్రశంసలు

Mahesh Babu calls Priyanka Chopra uncompromising and formidable in The Bluff
  • ప్రియాంక చోప్రా కొత్త సినిమా 'ది బ్లఫ్' ట్రైలర్‌పై మహేశ్‌ ప్రశంసలు
  • ప్రియాంకను 'రాజీపడని, దృఢమైన' నటిగా అభివర్ణించిన సూప‌ర్ స్టార్‌
  • ఫిబ్రవరి 25న ప్రైమ్ వీడియోలో విడుదల కానున్న 'ది బ్లఫ్'
  • రాజమౌళి దర్శకత్వంలో 'వారణాసి'లో కలిసి నటిస్తున్న జంట
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాపై టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రియాంక ప్రధాన పాత్రలో నటించిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ది బ్లఫ్' ట్రైలర్‌ను చూసిన మహేశ్‌, సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆమె నటనను కొనియాడుతూ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.

"ట్రైలర్ అద్భుతంగా ఉంది. ప్రియాంక చోప్రా మరోసారి రాజీపడని, దృఢమైన నటన కనబరిచారు. ఫిబ్రవరి 25న విడుదలవుతున్న 'ది బ్లఫ్' చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు" అని మహేశ్‌ బాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

'ది బ్లఫ్' చిత్రం 1800ల కాలం నాటి కథతో తెరకెక్కుతోంది. ఇందులో ఎర్సెల్ బోడెన్ అనే ఒక మాజీ సముద్రపు దొంగ పాత్రలో ప్రియాంక కనిపించనున్నారు. తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగించే తల్లిగా ఆమె నటన ట్రైలర్‌లో ఆకట్టుకుంటోంది. ప్రముఖ దర్శకులు రూసో బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా, ఫిబ్రవరి 25న ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.

ఇదిలా ఉంటే.. మహేశ్‌ బాబు, ప్రియాంక చోప్రా తొలిసారిగా కలిసి ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' చిత్రంలో వీరిద్దరూ జంటగా కనిపించనున్నారు. గతంలో ఈ సినిమా గురించి ప్రియాంక మాట్లాడుతూ.. రాజమౌళి, మహేశ్‌ బాబు వంటి దిగ్గజాలతో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పిన విషయం తెలిసిందే.
Mahesh Babu
Priyanka Chopra
The Bluff
SS Rajamouli
Varansi Movie
Hollywood
Tollywood
Prime Video
Russo Brothers

More Telugu News