KTR: కేటీఆర్‌కు ఆ విషయాలు చెప్పాం: సిట్ అధికారులు

KTR SIT Officials Clarify Investigation Details
  • సాక్షులను ప్రభావితం చేయవద్దని చెప్పామన్న సిట్
  • మళ్లీ అవసరమైతే విచారణకు పిలుస్తామని కూడా చెప్పామని వెల్లడి
  • కేటీఆర్‌ను ఒంటరిగానే విచారించినట్లు స్పష్టీకరణ
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు స్పందించారు. 2024 మార్చిలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో సిట్ దర్యాప్తు జరుపుతోంది. కేటీఆర్ విచారణ నేపథ్యంలో పలు ఊహాగానాలు మీడియాలో రావడంతో సిట్ ఓ ప్రకటన విడుదల చేసింది.

సాక్షులను ప్రభావితం చేయవద్దని కేటీఆర్‌కు తెలియజేసినట్లు సిట్ తెలిపింది. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని కూడా ఆయనకు చెప్పినట్లు వెల్లడించింది. కేసీఆర్‌ను మరొకరితో కలిసి విచారణ జరిపారని మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కూడా సిట్ స్పందించింది.

కేటీఆర్‌ను ఒంటరిగానే ప్రశ్నించామని స్పష్టం చేసింది. ఆధారాలు, రికార్డులను ముందు ఉంచి ప్రశ్నించినట్లు పేర్కొంది. ఈ విచారణ నిష్పక్షపాతంగా జరిగిందని వెల్లడించింది. ఎలాంటి అసత్య ప్రచారాలను విశ్వసించవద్దని సూచించింది. అధికారిక ప్రకటనను మాత్రమే విశ్వసించాలని తెలిపింది.
KTR
KTR phone tapping case
Telangana phone tapping
SIT investigation
Hyderabad police
Sajjanar

More Telugu News