Mandadi Prabhakar Reddy: బాధ్యతలు స్వీకరించిన రెండు వారాల్లోనే.. నార్ముల్ మదర్ డెయిరీ ఛైర్మన్ రాజీనామా.. ఎందుకంటే?

Mandadi Prabhakar Reddy Resigns as Narmul Mother Dairy Chairman
  • రెండు వారాల్లోనే రాజీనామా చేయడంతో చర్చ
  • పాడి రైతుల పెండింగ్ బిల్లుల విషయంలో విభేదాల కారణంగా రాజీనామా
  • ఈ నెల 8న ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్ రెడ్డి
నార్ముల్ మదర్ డెయిరీ ఛైర్మన్ మందడి ప్రభాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. నల్గొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం నార్ముల్ మదర్ డెయిరీ ఛైర్మన్‌గా ఆయన రెండు వారాల క్రితమే బాధ్యతలు స్వీకరించగా, ఇంతలోనే ఆయన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.

నార్ముల్ మదర్ డెయిరీకి ఛైర్మన్‌గా పనిచేసిన మధసూదన్ రెడ్డి రాజీనామా చేయడంతో ప్రభాకర్ రెడ్డి ఆ బాధ్యతలు చేపట్టారు. పాడి రైతుల పెండింగ్ బిల్లుల విషయంలో విభేదాల తలెత్తడంతోనే ప్రభాకర్ రెడ్డి ఛైర్మన్‌తో పాటు డైరెక్టర్ పదవులకు రాజీనామా చేసినట్లు సమాచారం.

మందడి ప్రభాకర్ రెడ్డి ఈ నెల 8న ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 25 లోగా రూ.12 కోట్లు సంస్థకు అందేలా చూస్తానని ఆయన బాధ్యతలు స్వీకరించిన రోజు హామీ ఇచ్చారు. పాడి రైతుల పెండింగ్ బిల్లులు రూ.25 కోట్లకు పైగా ఉంటాయని అంచనా.
Mandadi Prabhakar Reddy
Narmul Mother Dairy
Mother Dairy Chairman
Telangana Dairy
Dairy Farmers

More Telugu News