YS Sharmila: కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోండి: షర్మిల

YS Sharmila Demands Withdrawal of Support to Central Government
  • అమరావతికి రాజధాని హోదా కల్పించడంలో కేంద్రం తాత్సారం చేస్తోందన్న షర్మిల
  • రాష్ట్రానికి ప్రాజెక్టులు, నిధులు రావడం లేదని విమర్శ
  • మోదీకి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్న
కేంద్ర ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీకి ఆర్థికసాయం చేయడంలో, అమరావతికి రాజధాని హోదా కల్పించడంలో కేంద్రం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరుగుతోందని అన్నారు. కేంద్రాన్ని అభ్యర్థించడం కంటే... కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడమే బెటర్ అని చెప్పారు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు రావడం లేదని షర్మిల అన్నారు. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీకి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరగక ముందే కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలని సూచించారు.

పేద ప్రజల ఉపాధిని నిర్వీర్యం చేసే జాతీయ ఉపాధి హామీ కొత్త చట్టానికి మద్దతు ఇవ్వడం దారుణమని అన్నారు. కొత్త చట్టంతో రాష్ట్రాలపై పెను ఆర్థిక భారం పడుతుందని చెప్పారు. 
YS Sharmila
Andhra Pradesh
AP Congress
Central Government
Financial Aid
Amaravati
National Employment Guarantee Act
Political News

More Telugu News