Medaram: మేడారంలో కూలిన భారీ హోర్డింగ్
- జంపన్న వాగు నుంచి గద్దెలకు వెళ్లే మార్గంలో ఘటన
- భక్తులు ఎక్కువగా లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
- ఒకరికి స్వల్ప గాయాలు.. ఆసుపత్రిలో చికిత్స
మేడారంలో పెను ప్రమాదం తప్పింది. ఆసియాలోఅవనే అతిపెద్ద గిరిజన జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతర ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో హరిత హోటల్ సమీపంలోని వై-జంక్షన్ వద్ద భారీ హోర్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. జంపన్న వాగు నుంచి గద్దెల వైపు వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ దుర్ఘటనలో ఒక భక్తుడికి స్వల్ప గాయాలు కాగా, వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. లైటింగ్ నేమ్ బోర్డు హోర్డింగ్ కూలిపోవడానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. జాతరకు దాదాపు నెల రోజుల ముందు నుంచే లక్షలాది మంది భక్తులు మేడారం చేరుకుని, మొక్కులు చెల్లించుకుంటున్నారు.