World Health Organization: ప్రపంచ ఆరోగ్య సంస్థ విషయంలో అమెరికా కీలక నిర్ణయం

World Health Organization America Officially Withdraws From WHO
  • డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపిన అమెరికా
  • నిధులు నిలిపివేస్తున్నట్లు అమెరికా వెల్లడి
  • సంస్థకు 260 మిలియన్ డాలర్లు బకాయి పడిన అమెరికా
కరోనా మహమ్మారిని అదుపు చేయడంలో, సంస్కరణలను అమలు చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) విఫలమైందని ఆరోపిస్తూ అమెరికా ఆ సంస్థ నుంచి వైదొలిగింది. ఈ మేరకు అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక నుంచి డబ్ల్యూహెచ్ఓకు అమెరికా నుంచి వెళ్లే అన్ని రకాల నిధులను నిలిపివేస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల నుంచి తమ దేశ సిబ్బందిని వెనక్కి పిలిపించినట్లు తెలిపింది.

డబ్ల్యూహెచ్ఓ సంస్థకు సంబంధించిన సాంకేతిక కమిటీలు, వర్కింగ్ గ్రూపుల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. అయితే, పరిమిత పరిధిలో డబ్ల్యూహెచ్ఓతో కలిసి పని చేయడానికి అవకాశం ఉంటుందని అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ సంస్థ నుంచి వైదొలుగుతామని పలుమార్లు హెచ్చరించారు. తాజాగా, అమెరికా అధికారికంగా డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలుగుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

డబ్ల్యూహెచ్ఓకు బకాయిపడిన అమెరికా

డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలిగే సమయానికి అమెరికా ఆ సంస్థకు భారీ మొత్తంలో బకాయి పడింది. 260 మిలియన్ డాలర్ల బకాయిలను అమెరికా డబ్ల్యూహెచ్ఓకు చెల్లించాల్సి ఉందని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. ఇది భారతీయ కరెన్సీలో సుమారు రూ.2,382 కోట్లు. ఈ బకాయిని పూర్తిగా చెల్లించే వరకు డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా ఉపసంహరణ పూర్తి కాదని ఆ సంస్థ అధికారులు పేర్కొన్నారు. అయితే, సంస్థ నుంచి వైదొలగడానికి ముందు బకాయిలు చెల్లించాలనే నిబంధన ఏమీ లేదని అమెరికా అధికారులు స్పష్టం చేశారు.
World Health Organization
WHO
America
US
United States
Coronavirus
COVID-19
Funding

More Telugu News