Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేశ్ కు బర్త్ డే విషెస్ తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi Wishes AP Minister Nara Lokesh a Happy Birthday
  • నేడు నారా లోకేశ్ పుట్టినరోజు
  • సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ
  • ఆయురారోగ్యాలతో, శక్తియుక్తులతో కొనసాగాలని చిరంజీవి ఆకాంక్ష
  • అంకితభావంతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని సూచన
  • మీ ప్రయాణం రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు తేవాలన్న మెగాస్టార్
ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ నేడు (జనవరి 23) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా లోకేశ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ మేరకు చిరంజీవి తన పోస్ట్‌లో, "గౌరవనీయ మంత్రి నారా లోకేశ్‌కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, శక్తియుక్తులతో కొనసాగాలి. అంకితభావంతో ఆంధ్రప్రదేశ్‌కు సేవ చేయడంలో మీరు మరింతగా విజయం సాధించాలి. మీ ప్రయాణం రాష్ట్రంలో సానుకూల మార్పు తీసుకురావడంతో పాటు, ఉజ్వల భవిష్యత్తును అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని పేర్కొన్నారు.

కాగా, లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. 
Nara Lokesh
Chiranjeevi
AP Minister
Andhra Pradesh
Birthday Wishes
TDP
Telugu Desam Party
IT Minister

More Telugu News