Nara Lokesh: నారా లోకేశ్ కు జూనియర్ ఎన్టీఆర్ విషెస్
- నేడు నారా లోకేశ్ పుట్టినరోజు
- వెల్లువెత్తుతున్న పుట్టినరోజు శుభాకాంక్షలు
- ఈ ఏడాది మీకు అద్భుతమైన సంవత్సరం కావాలని ఆకాంక్షిస్తున్నానన్న తారక్
టీడీపీ జనరల్ సెక్రటరీ, మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. లోకేశ్ బావ, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా బర్త్ డే విషెస్ తెలిపారు. ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. "పుట్టిన రోజు శుభాకాంక్షలు నారా లోకేశ్. ఈ ఏడాది మీకు మరో అద్భుతమైన సంవత్సరం కావాలని ఆకాంక్షిస్తున్నా" అని ట్వీట్ చేశారు.