ఆకాశమే హద్దుగా పసిడి పరుగు: రూ. 1.60 లక్షల దిశగా బంగారం!
ఈ ప్రభావం నేరుగా స్థానిక మార్కెట్లపై పడింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గురువారం అర్థరాత్రి సమయానికి 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్ల) బంగారం ధర రూ. 1,59,000కు చేరుకుంది. వెండి కూడా అదే బాటలో పయనిస్తూ కిలో ధర రూ. 3,26,000 వద్ద స్థిరపడింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ విలువలో మార్పుల కారణంగా రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.