Faria Abdullah: తాను ప్రేమలో ఉన్నట్టు ప్రకటించిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా

Faria Abdullah Announces She Is In Love
  • ఒక హిందూ అబ్బాయితో డేటింగ్ చేస్తున్న ఫరియా
  • కొరియోగ్రాఫర్ తో ప్రేమలో ఉన్నట్టు వెల్లడి
  • తమది ఒక బలమైన పార్టనర్‌షిప్ అన్న ఫరియా

‘జాతి రత్నాలు’ సినిమాతో స్టార్‌డమ్ దక్కించుకున్న హైదరాబాదీ భామ ఫరియా అబ్దుల్లా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. గ్లామర్‌కే పరిమితం కాకుండా నటన, డ్యాన్స్, ర్యాప్ సాంగ్స్‌తో మల్టీ టాలెంటెడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఫరియా.. తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా, తాను ప్రస్తుతం ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఒక హిందూ అబ్బాయితో డేటింగ్ చేస్తున్నానని, ఇండస్ట్రీలో ఉంటూనే కెరీర్‌–వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో తన ప్రియుడి మద్దతు ఎంతో కీలకమని వెల్లడించారు.


ఫరియా మనసు దోచుకున్న ఆ వ్యక్తి సినీ పరిశ్రమకు చెందిన యంగ్ కొరియోగ్రాఫర్ కావడం విశేషం. ఇద్దరూ కలిసి పని చేస్తున్నామని, తనలోని డ్యాన్స్, మ్యూజిక్ టాలెంట్‌ను బయటకు తీసుకురావడంలో అతని పాత్ర చాలా ఉందని ఫరియా తెలిపారు.


మతభేదాలపై వస్తున్న ప్రశ్నలకు కూడా ఆమె స్పష్టతనిచ్చారు. తాను ముస్లింను అయినప్పటికీ, హిందూ యువకుడితో ఉన్న ఈ బంధాన్ని కేవలం లవ్ అఫైర్‌గా చూడట్లేదని, ఇది ఒక బలమైన పార్టనర్‌షిప్ అని చెప్పారు. వరుస సినిమాలతో కెరీర్‌లో జోరు కొనసాగిస్తున్న ఫరియా.. తన ప్రేమ, వ్యక్తిగత జీవితంపై చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Faria Abdullah
Faria Abdullah love affair
Jathi Ratnalu
Telugu actress
dating Hindu guy
young choreographer
interfaith relationship
love and career balance
Telugu cinema news
Hyderabad actress

More Telugu News