Satish Kumar: జగద్గిరిగుట్టలో ఘోరం... దివ్యాంగురాలిని చంపేపి, ఆత్మహత్యాయత్నం చేసిన ముగ్గురు కుటుంబ సభ్యులు

Jagadgirigutta Tragedy Family Kills Disabled Daughter Tries Suicide
  • ఆర్థిక ఇబ్బందులు తాళలేక సామూహిక ఆత్మహత్యకు యత్నించిన సతీశ్ కుమార్ కుటుంబం
  • కుమారుడు నితీశ్ స్నేహితుడికి ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి
  • ముందుగా పుట్టుకతోనే దివ్యాంగురాలిగా ఉన్న కుమార్తె శ్రీజావళి(18)ను హతమార్చిన సతీశ్‌కుమార్‌, ఆమని దంపతులు 
కుత్బుల్లాపూర్ పరిధిలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఒక కుటుంబం సామూహిక ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

విజయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న సతీశ్ కుమార్, ఆయన భార్య ఆమని, కుమారుడు నితీశ్, కుమార్తె శ్రీజావళితో కలిసి జీవిస్తున్నారు. కొంతకాలంగా ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో మనోవేదనకు గురైన సతీశ్ దంపతులు, రెండు రోజుల క్రితం పుట్టుకతోనే దివ్యాంగురాలైన తమ కుమార్తె శ్రీజావళి (18)ని హతమార్చినట్లు సమాచారం.

ఆ తరువాత, మిగిలిన ముగ్గురు మృతదేహంతోనే రెండు రోజులుగా ఇంట్లోనే ఉన్నారు. బుధవారం నాడు వారు చేతులు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా, కుమారుడు నితీశ్ ఈ విషయాన్ని తన స్నేహితుడికి తెలియజేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. 
Satish Kumar
Jagadgirigutta
Kuthbullapur
Family Suicide Attempt
Financial Problems
Divyanguralu
Sreejavali
Amani
Nitheesh

More Telugu News