మేడారంలో కుక్కకు ఎత్తు 'బంగారం'... క్షమాపణ చెప్పిన సినీ నటి
- కుక్కకు తులాభారం వేసిన సినీ నటి టీనా శ్రావ్య
- తన కుక్కకు ఆరోగ్యం బాగా లేని సమయంలో మొక్కుకున్నట్లు వెల్లడి
- తనకు కించపరిచే ఉద్దేశం లేదని వీడియో విడుదల చేసిన నటి
- భక్తుల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని వేడుకోలు
సాధారణంగా భక్తులు అమ్మవార్లకు 'బంగారం' సమర్పిస్తుంటారు. అయితే, టీనా శ్రావ్య చేసిన పనిపై విమర్శలు రావడంతో ఆమె స్పందించారు. తన కుక్క అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో కోలుకుంటే అమ్మవార్లకు 'బంగారం' సమర్పిస్తానని మొక్కుకున్నానని ఆమె తెలిపారు. ఆ కారణంగానే ఇలా చేశానని, గిరిజన సంప్రదాయాలను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని ఆమె స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతిని ఉంటే తనను క్షమించాలని కోరుతూ ఆమె ఒక వీడియోను విడుదల చేశారు.