మున్సిపల్ ఎన్నికలకు ముందు... తెలంగాణలో 47 మంది కమిషనర్ల బదిలీ
- ఎస్ఈసీ మార్గదర్శకాల మేరకు కమిషనర్లను బదిలీ చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు
- సొంత జిల్లాల్లో పని చేస్తున్నవారు, ఒకేచోట సుదీర్ఘకాలం పని చేస్తున్న వారు బదిలీ
- బదిలీ అయిన అధికారులు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం
2026 మున్సిపల్ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. నిష్పాక్షికంగా ఎన్నికల నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఈ బదిలీలు చేపట్టింది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎస్ఈసీ మార్గదర్శకాల మేరకు కమిషనర్లను బదిలీ చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
సొంత జిల్లాల్లో పనిచేస్తున్న వారు, ఒకేచోట సుదీర్ఘ కాలం పనిచేస్తున్న అధికారులను పరిపాలనాపరమైన కారణాలతో పాటు పదోన్నతులపై బదిలీ చేసింది.
సి.వి.ఎన్. రాజు ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-3) నుంచి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. జి.రాజు క్యాతనపల్లి నుంచి ఆదిలాబాద్ మున్సిపాల్ కమిషనర్‌గా, ముసాబ్ అహ్మద్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా, బి.శ్రీనివాస్ ఆలేరు నుంచి హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. బి.శరత్ చంద్ర ప్రమోషన్‌పై నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా వెళ్లనున్నారు. బదిలీ అయిన అధికారులు వెంటనే తమకు కేటాయించిన కొత్త ప్రాంతాల్లో బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.