Gautam Gambhir: ప్రధాని తర్వాత అత్యంత కష్టమైన ఉద్యోగం గంభీర్‌దే: శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Gautam Gambhirs job toughest after PM says Shashi Tharoor
  • నాగ్‌పూర్‌లో గౌతమ్ గంభీర్‌తో భేటీ అయిన శశిథరూర్
  • గంభీర్ ప్రశాంత స్వభావం, నాయకత్వ పటిమ కలిగిన వ్యక్తి అని కొనియాడిన థరూర్
  • భారత్-న్యూజిలాండ్ టీ20 మ్యాచ్‌కు ముందు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ ఎంపీ
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్.. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి తర్వాత భారతదేశంలో అత్యంత కష్టమైన ఉద్యోగం గంభీర్‌దేనని ఆయన అభివర్ణించారు. బుధవారం నాగ్‌పూర్‌లో తన పాత మిత్రుడైన గంభీర్‌తో సమావేశమైన అనంతరం థరూర్ ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.

గంభీర్‌తో స్నేహపూర్వకంగా, ఫ్రాంక్‌గా చర్చ జరిగిందని థరూర్ తెలిపారు. "ప్రతిరోజూ లక్షలాది మంది ఆయన నిర్ణయాలను విమర్శిస్తున్నా, గంభీర్ ఎంతో ప్రశాంతంగా, మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నాడు. అతడి నిశ్శబ్ద సంకల్పానికి, సమర్థవంతమైన నాయకత్వానికి నా అభినందనలు" అని తన పోస్టులో పేర్కొన్నారు.

భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో గంభీర్‌కు థరూర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు నుంచి ఆయనకు అంతా మంచే జరగాలని ఆశిస్తున్నట్లు పేర్కొంటూ, INDvNZT20 అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. ఈ సందర్భంగా తామిద్దరి సెల్ఫీని కూడా థరూర్ పంచుకున్నారు.
Gautam Gambhir
Shashi Tharoor
India head coach
Indian cricket team
T20 series
India vs New Zealand
Nagpur
Cricket coach
INDvNZT20
Indian politics

More Telugu News