Tamareddy Bharadwaja: 'రాజా సాబ్' అందుకే ఆడలేదు: తమ్మారెడ్డి భరద్వాజ!

Tamareddy Bharadwaja Interview
  • సంక్రాంతి బరిలో దిగిన 'రాజా సాబ్'
  • ఆశించిన స్థాయిలో ఆడని సినిమా
  • కథలో మార్పులే కారణమన్న తమ్మారెడ్డి 
  • మన కల్చర్ తో సినిమాలు రావాలని వ్యాఖ్య  

ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన 'రాజా సాబ్' సంక్రాంతి బరిలోకి దిగింది. తొలి ఆటతోనే ఈ సినిమాపై ప్రేక్షకులు విమర్శలు కురిపించారు. ప్రభాస్ ను తాము అనుకున్నట్టుగా మారుతి చూపించలేదనే అసంతృప్తిని వ్యక్తం చేశారు. వసూళ్లు బాగానే రాబట్టినప్పటికీ, కంటెంట్ పరంగా ప్రేక్షకులు నిరాశకు లోనయ్యారు. అలాంటి ఈ సినిమాను గురించి తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్యూలో తమ్మారెడ్డి భరద్వాజ ప్రస్తావించారు. 

'రాజా సాబ్' సినిమాకి సంబంధించిన పనులు మూడు నాలుగేళ్ల పాటు కొనసాగాయి. నేను విన్నదేంటి అంటే, పాన్ ఇండియా సినిమాల మధ్యలో ప్రభాస్ ఒక చిన్న సినిమా చేస్తే బాగుంటుందని అనుకున్నారు. మంచి ఎంటర్టైన్ మెంట్ ను ఇచ్చే సినిమాలు తీయడంలో మారుతికి మంచి పేరు ఉంది. అయితే ఎలా అయితే ఈ సినిమాను తీయాలని ముందుగా అనుకున్నారో, అలాగే తీసి ఉంటే బాగుండేది. కానీ ఆ తరువాత పాన్ ఇండియా టచ్ ఇవ్వడానికి ట్రై చేయడమే కథ దెబ్బతినడానికి కారణమని నేను అనుకుంటున్నాను" అని అన్నారు. 

"రాజమౌళి చేశారని చెప్పి అందరూ పాన్ ఇండియా సినిమాలు చేయాలనుకోవడం కరెక్టు కాదు. రాజమౌళి రెమ్యునరేషన్స్ పై కంటే కథపై పెట్టే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మిగతావాళ్లు 80 శాతం రెమ్యునరేషన్స్ పై పెట్టి, కథపై 20 శాతమే ఖర్చు చేస్తున్నారు. అక్కడే అంతా దెబ్బ తింటున్నారనేది నా అభిప్రాయం. మన కల్చర్ ను చూపిస్తూ మనం తీసుకున్న సినిమాలే బాగా ఆడుతున్నాయి. అందరి కోసం అనుకుని తీసిన సినిమాలు సరిగ్గా ఆడటం లేదు. ఇతర భాషల్లోను ఈ విషయం మనకి స్పష్టంగా కనిపిస్తోంది" అని అన్నారు.

Tamareddy Bharadwaja
Raja Saab
Prabhas
Maruthi
Pan India movies
Rajamouli
Telugu cinema
movie review
box office collections
Tollywood

More Telugu News