Revanth Reddy: దావోస్ సదస్సు వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రతిపాదన

Revanth Reddy proposes key initiative at Davos
  • ప్రపంచ ఆర్థిక సదస్సు ఫాలోఆప్ సదస్సును తెలంగాణలో నిర్వహించాలన్న ముఖ్యమంత్రి
  • ప్రతి సంవత్సరం జులైలో హైదరాబాద్‌లో ఫాలోఅప్ సదస్సు నిర్వహించాలన్న సీఎం
  • మద్దతు తెలిపిన ప్రముఖ వ్యాపారవేత్తలు, పాలసీ నిర్ణేతలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక ప్రతిపాదన చేశారు. ప్రపంచ ఆర్థిక సదస్సు ఫాలోఅప్ సదస్సును ప్రతి సంవత్సరం తెలంగాణలో నిర్వహించాలని ఆయన సూచించారు. దావోస్‌లో జరుగుతున్న సదస్సులో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రతి సంవత్సరం జులైలో హైదరాబాద్ నగరంలో ఫాలోఅప్ సదస్సు నిర్వహించాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనకు ప్రముఖ వ్యాపారవేత్తలు, పాలసీ నిర్ణేతలు మద్దతు తెలిపారు.

ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బ్లెజ్ కో ఫౌండర్ సీఈవో దినకర్ మునగాల సమావేశమయ్యారు. హైదరాబాద్ లో బ్లెజ్ ఆర్ అండ్ డీ సెంటర్ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వంతో ఆయన ఎంవోయూ కుదుర్చుకున్నారు. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
Revanth Reddy
Telangana
Davos
World Economic Forum
Hyderabad
Follow-up Summit
Blaze R&D Center

More Telugu News