Donald Trump: ఇరాన్ ను భూస్థాపితం చేయాలని ఆదేశించా: ట్రంప్

Trump says Iran would be wiped off the face of the Earth if hes assassinated
  • తనకేమైనా అయితే ఏం జరుగుతుందో చెప్పిన ట్రంప్
  • ప్రపంచపటంలో నుంచి ఇరాన్ తుడిచిపెట్టుకుపోతుందని హెచ్చరిక
  • ఖమేనీపై చెయ్యి వేస్తే ప్రపంచాన్నే తగలబెడతామన్న ఇరాన్ కు కౌంటర్
ఇరాన్, అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు పీక్ కు చేరాయి.. తమ లీడర్ కు హాని తలపెడితే ప్రపంచమే తగలబడిపోతుందని ఇరాన్ హెచ్చరించగా.. తనను హత్య చేస్తే ఇరాన్ భూస్థాపితం అవుతుందని ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థతో ట్రంప్ మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనపై ఇరాన్ హత్యాయత్నం చేస్తే.. తాను బతికి ఉన్నా, చనిపోయినా సరే.. ఆ దేశాన్ని భూస్థాపితం చేయాలని తన సలహాదారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని ట్రంప్ చెప్పారు. ఇరాన్ లో జరుగుతున్న అల్లర్లకు మద్దతు పలుకుతున్న ట్రంప్ పై ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ లో కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపైనా ఖమేనీ మండిపడ్డారు.

ఈ క్రమంలోనే తమ నాయకుడిపై చేయి వేయాలని చూస్తే ఆ చేతిని తెగనరుకుతామని, ఖమేనీకి ఏదైనా జరిగితే ప్రపంచాన్ని తగలబెడతామని ఇరాన్ సైన్యానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు హెచ్చరించారు. దీనిపై ట్రంప్ తాజాగా స్పందిస్తూ.. తనను చంపేయాలని చూసినా, చంపేసినా మీరు భూమ్మీదే ఉండరని తీవ్ర హెచ్చరికలు చేశారు.
Donald Trump
Iran
US Iran tensions
Ayatollah Khamenei
Iran supreme leader
Iran protests
Military threats
US foreign policy
Middle East conflict
Iran nuclear deal

More Telugu News