Begumpet: బేగంపేటలో ఫ్లైఓవర్‌పై బోల్తా పడ్డ కారు.. వీడియో ఇదిగో!
- డ్రైవర్ సహా నలుగురు ప్రయాణికులకు గాయాలు
- డివైడర్ ను ఢీ కొట్టడంతో కారు బోల్తా.. ట్రాఫిక్ జామ్
- క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన ట్రాఫిక్ పోలీసులు
ఫ్లైఓవర్ పై వేగంగా వెళుతున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. దీంతో కారు బోల్తాపడింది. హైదరాబాద్ లోని బేగంపేట ఫ్లైఓవర్ పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే వాహనదారులు స్పందించి అందులోని ప్రయాణికులను బయటకు తీశారు.
గాయాలపాలైన వారిని ట్రాఫిక్ పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో బేగంపేటలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బోల్తాపడ్డ కారును స్థానికుల సాయంతో పోలీసులు పక్కకు జరిపించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.