Chiranjeevi: 'మన శంకర వరప్రసాద్ గారు'లోని ఈ పాట పాడింది ఎవరో తెలుసా...?

Chiranjeevis Manashankara Varaprasad Garu Fly High Song Singer Revealed
  • ‘మన శంకరవరప్రసాద్‌గారు’ మూవీలో ఫ్లై..హై అంటూ సాగే పాటను చిరు మేనకోడలు నైరా ఆలపించిందన్న దర్శకుడు అనిల్ రావిపూడి
  • నైరా చిరంజీవి సోదరి మాధవి కుమార్తె అని వెల్లడి
  • పూర్తి వీడియో పాటను బుధవారం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటన
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’ జనవరి 12న విడుదలైంది. విడుదలైన రోజు నుంచే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతూ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఈ చిత్రంలోని "ఫ్లై.. హై" అంటూ సాగే పాటకు అభిమానుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ పాటకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ పాటను మెగాస్టార్ చిరంజీవి మేనకోడలు నైరా ఆలపించినట్లు దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఆయన ఒక పోస్ట్ చేశారు. నైరా చిరంజీవి సోదరి మాధవి కుమార్తె అని ఆయన పేర్కొన్నారు. ఈ వార్త తెలుసుకున్న మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, "ఫ్లై.. హై" పూర్తి వీడియో పాటను బుధవారం ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 
Chiranjeevi
Manashankara Varaprasad Garu
Anil Ravipudi
Naira
Fly High Song
Telugu Movie
Mega Family
Box Office Collection
Maadhavi

More Telugu News