ఆంధ్రా భోజనం రుచికి జపాన్ దౌత్య సిబ్బంది ఫిదా... సీఎం చంద్రబాబు స్పందన
- ఢిల్లీలోని ఏపీ భవన్‌లో భోజనం చేసిన జపాన్ దౌత్య సిబ్బంది
- ఆంధ్రా థాలీ రుచులు అద్భుతమంటూ సోషల్ మీడియాలో పోస్ట్
- వారి పోస్ట్‌పై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
- ఆంధ్రా వంటకాలు తమ ఆప్యాయతను చాటుతాయన్న ముఖ్యమంత్రి
- జపాన్ ప్రజలను ఏపీకి రెండో ఇల్లుగా భావించి రావాలని ఆహ్వానం
ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో జపాన్ దౌత్య సిబ్బంది ఆంధ్రా భోజనాన్ని ఆస్వాదించారు. సంప్రదాయ వంటకాల రుచిపై వారు ప్రశంసలు కురిపించగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై స్పందిస్తూ వారిని రాష్ట్రానికి సాదరంగా ఆహ్వానించారు.
జపాన్ దౌత్యవేత్తల బృందం మంగళవారం ఏపీ భవన్‌లో టీమ్ లంచ్‌లో పాల్గొని, సంప్రదాయ ఆంధ్రా థాలీని రుచి చూసింది. ఈ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ.. "మేము ఘాటైన రుచులతో కూడిన అద్భుతమైన, నిజమైన ఆంధ్రా థాలీని ఆస్వాదించాం. ధన్యవాదాలు!" అని పేర్కొంది.
ఈ పోస్ట్‌పై సీఎం చంద్రబాబు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. "మా సంప్రదాయ ఆహారాన్ని మీరు ఆస్వాదించడం చాలా సంతోషంగా ఉంది. జపాన్ వంటకాలైన సుషీ, సషిమి ఎలాగైతే ఆ దేశ సంస్కృతిలో కచ్చితత్వం, సమతుల్యతను ప్రతిబింబిస్తాయో, అలాగే ఆంధ్రా వంటకాలు తమ రుచుల ద్వారా ఆప్యాయతను, ఉదారతను చాటుతాయి" అని చంద్రబాబు పేర్కొన్నారు.
అంతేకాకుండా, "మీ కోసం, జపాన్ నుంచి మా రాష్ట్రానికి వచ్చే అతిథుల కోసం ఇంకా ఎన్నో రుచులు వేచి ఉన్నాయి. మీ అందరికీ రెండో ఇల్లయిన ఆంధ్రప్రదేశ్‌కు స్వాగతం పలకడానికి మేం ఎదురుచూస్తున్నాం" అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.