Maneka Gandhi: వీధి శునకాల అంశం... మేనకా గాంధీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

Supreme Court Angered by Maneka Gandhis Comments on Street Dogs
  • తీర్పుపై మేనకా గాంధీ చేసిన విమర్శలను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు
  • ఎలాంటి ఆలోచన లేకుండా అందరిపై ఆమె వ్యాఖ్యలు చేశారన్న సుప్రీంకోర్టు
  • కోర్టు ధిక్కారమే అయినప్పటికీ న్యాయస్థానం ఔన్నత్యం దృష్ట్యా చర్యలు తీసుకోవడం లేదని వ్యాఖ్య
వీధి కుక్కల అంశానికి సంబంధించిన కోర్టు ఆదేశాలను విమర్శిస్తూ కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీధి శునకాలపై ఇచ్చిన తీర్పుపై మేనకా గాంధీ చేసిన విమర్శలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆమె కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని పేర్కొంది.

వీధి శునకాల అంశంపై సుప్రీంకోర్టు నేడు మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మేనకా గాంధీ విమర్శలపై అసహనం వ్యక్తం చేసింది. ఆమె ఎలాంటి ఆలోచన లేకుండా అందరిపై అన్ని రకాల వ్యాఖ్యలు చేశారని మండిపడింది.

కోర్టు ఆచితూచి వ్యవహరించాలని మేనకా గాంధీ తరఫు న్యాయవాది చెప్పడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అసలు మీ క్లయింటు మేనకా గాంధీ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో తెలుసా? ఆమె పాడ్‌కాస్ట్‌ను విన్నారా? ఎలాంటి ఆలోచన లేకుండా ఆమె అందరిపై వ్యాఖ్యలు చేశారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆమె వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమేనని, కానీ న్యాయస్థానం ఔన్నత్యం దృష్ట్యా ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు వీధి శునకాల సమస్యను కట్టడి చేసేందుకు ఆమె ఎంత బడ్జెట్ కేటాయించారని సుప్రీంకోర్టు మేనకా గాంధీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. శునకాలకు ఆహారం పెట్టే వారిని బాధ్యులుగా చేయాలని న్యాయస్థానం తేలిగ్గా చెప్పలేదని, సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యానించిందని అన్నారు.
Maneka Gandhi
Supreme Court
street dogs
court contempt
animal rights
dog feeding
court orders

More Telugu News