Shobhita Dhulipala: ఉత్కంఠను రేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ .. 'చీకటిలో'

Chekatilo Movie Update
  • శోభిత ధూళిపాళ నుంచి 'చీకటిలో'
  • సురేశ్ ప్రొడక్షన్స్ వారి సినిమా 
  • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • ఈ నెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో   

శోభిత ధూళిపాళ ప్రధానమైన పాత్రను పోషించిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ 'చీకటిలో'. చాలా గ్యాప్ తరువాత శోభిత చేసిన తెలుగు సినిమా ఇది. థియేటర్లలో కాకుండా నేరుగా ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఈ సినిమా 'అమెజాన్ ప్రైమ్' లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమాను సురేశ్ ప్రొడక్షన్స్ వారు నిర్మించడం విశేషం. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాను, తెలుగుతో పాటు ఇతర భాషల్లోను వదులుతున్నారు.

ఈ సినిమాలో 'సంధ్య' అనే పాత్రలో శోభిత కనిపించనుంది. రియల్ క్రైమ్ స్టోరీస్ ను గురించి చెప్పే ఒక కాన్సెప్ట్ తో ఆమె 'చీకటిలో' అనే ఒక పాడ్ కాస్ట్ ను మొదలుపెడుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులో యువతుల హత్యలు వరుసగా జరుగుతూ ఉంటాయి. సైకో కిల్లర్ చీకటిలో తాను అనుకున్న పనిని చాలా పకడ్బందీగా పూర్తి చేస్తూ ఉంటాడు. జరుగుతున్న హత్యలలో తన మార్క్ ఉండేలా చూసుకుంటాడు. అదే పద్ధతిలో ఆ కిల్లర్ సంధ్య దగ్గర పనిచేసే యువతిని హత్య చేస్తాడు. 

దాంతో ఆ నేరస్థుడిని తానే పట్టుకోవాలనే నిర్ణయానికి సంధ్య వస్తుంది. అందుకోసం ఆమె ఎలాంటి పథకం వేస్తుంది? సైకో కిల్లర్ ను పట్టుకునే విషయంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుంది? ఆమెకి తెలిసే నిజాలేమిటి? అనేది కథ. విశ్వదేవ్ రాచకొండ .. చైతన్య వరలక్ష్మి .. ఈషా చావ్లా .. ఆమని .. ఝాన్సీ తదితరులు కీలకమైన పాత్రలను పోషించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి మరి. 

Shobhita Dhulipala
Cheekatilo
Telugu movie
crime thriller
Amazon Prime
OTT release
Suresh Productions
cyber crime
Hyderabad crimes

More Telugu News