Farooq Abdullah: పాకిస్థాన్‌తో భారత్ చర్చలు జరపాలా అని అడిగితే, ఫరూక్ అబ్దుల్లా ఏం చెప్పారంటే?

Farooq Abdullah responds on India Pakistan talks question
  • మీడియాకు పాకిస్థాన్ ఫోబియా ఉందన్న ఫరూక్ అబ్దుల్లా
  • పొరుగు దేశాలను మార్చలేమని వాజపేయి చేసిన వ్యాఖ్యల ప్రస్తావన
  • దేశం కోసం తాము బుల్లెట్లను ఎదుర్కొందన్న ఫరూక్ అబ్దుల్లా
మీడియాకు పాకిస్థాన్ ఫోబియా ఉందని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో భారత్ చర్చలు జరపాలా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పొరుగు దేశాలను మార్చలేమని గతంలో మాజీ ప్రధాని వాజపేయి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

భారతదేశం కోసం తాము గతంలో బుల్లెట్లను ఎదుర్కొన్నామని ఫరూక్ అబ్దుల్లా మీడియాతో అన్నారు. అవసరమైతే దేశం కోసం మళ్ళీ బుల్లెట్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు జమ్ము కశ్మీర్‌లో రాళ్ల దాడులు, ఉగ్రవాదాన్ని తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని బీజేపీ చేసిన ఆరోపణలను ఫరూక్ అబ్దుల్లా ఖండించారు. అలాంటి వ్యాఖ్యలు మూర్ఖత్వమేనని ఆయన అన్నారు. అలజడులు సృష్టించాలనుకున్నది వారేనని ఆయన విమర్శించారు.

భవిష్యత్తులో లడక్ తిరిగి జమ్ము కశ్మీర్‌లో విలీనం అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్ నుంచి జమ్మును వేరు చేసి రాష్ట్ర హోదా ఇవ్వాలనే డిమాండ్‌లపై ఆయన స్పందిస్తూ, తమకు అలాంటి ఆలోచన లేదని అన్నారు. అలాంటి డిమాండ్లు మూర్ఖత్వంతో, అజ్ఞానంతో కూడుకున్నవని ఆయన అభివర్ణించారు. లడక్‌ను వేరు చేయడం వల్ల ఏం ప్రయోజనం కలిగిందని ఆయన ప్రశ్నించారు. స్థానికంగా కొత్త జిల్లాల ఏర్పాటు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
Farooq Abdullah
India Pakistan talks
Jammu Kashmir
National Conference
Atal Bihari Vajpayee

More Telugu News