Eesha Rebba: తల్లిదండ్రులు లేని ఆడపిల్లను ఇండస్ట్రీలో అందరూ టార్గెట్ చేస్తారు: ఈషా రెబ్బా

Eesha Rebba Everyone targets orphan girls in the industry
  • తన స్కిన్ కలర్ వల్ల ఎదురైన అవమానాలను పంచుకున్న ఈషా
  • తన మోచేతులు నల్లగా ఉన్నాయని ఒక డైరెక్టర్ చెప్పాడని వెల్లడి
  • అవకాశాలు రావాలంటే పార్టీలకు వెళ్లాలని కొందరు చెప్పారన్న ఈషా

అచ్చ తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా తన కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టాలను అందరితో పంచుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 12 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆమె సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. తన స్కిన్ కలర్ వల్ల ఎదురైన అవమానాల గురించి ఇటీవల ఆమె మాట్లాడింది. ‘ఓం శాంతి శాంతి’ సినిమా ప్రమోషన్స్‌ సందర్భంగా ఈషా వెల్లడించిన విషయాలు చర్చనీయాంశంగా మారాయి.


తన కెరీర్ ప్రారంభంలో ఒక ఫొటో షూట్ సమయంలో, ఒక స్టార్ డైరెక్టర్ తన శరీరాన్ని అంగుళం అంగుళం జూమ్ చేసి చూస్తూ... నీ మోచేతులు నల్లగా ఉన్నాయని, నీవు ఇంకా తెల్లగా ఉండాలని అన్నాడని... ఆ వ్యాఖ్యలు ఎంతో బాధించాయని చెప్పింది. ఆ మాటలు విన్న తర్వాత చాలా ఏడ్చానని, కొంచెం తెల్లగా పుట్టి ఉంటే బాగుండేది అనిపించిందని తెలిపింది. తన తల్లి మరణించిన 12వ రోజునే షూటింగ్ కు వెళ్లాల్సి వచ్చిందని... తల్లిడండ్రులు లేని ఆడపిల్లను ఇండస్ట్రీలో అందరూ టార్గెట్ చేస్తారని తెలిపింది. 


అంతేకాకుండా, సినిమాలలో అవకాశాలు రావాలంటే పార్టీలకు వెళ్లాలని, తెలుగు అమ్మాయి మాదిరి రిజర్వ్ గా ఉండకూడదని కొందరు సలహాలు ఇచ్చేవారని గుర్తు చేసుకుంది. 

Eesha Rebba
Eesha Rebba interview
Telugu actress
Om Shanti Shanti
Telugu film industry
Tollywood
skin color shaming
nepotism
movie promotions
struggles in film industry

More Telugu News