Allari Naresh: అల్లరి నరేశ్‌ కుటుంబంలో విషాదం.. హీరో తాత కన్నుమూత

Allari Naresh grandfather Idara Venkatrao passes away
  • వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస
  • సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో అంత్యక్రియలు
  • నివాళులు అర్పించిన సినీ ప్రముఖులు
సినీ హీరో అల్లరి నరేశ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. నరేశ్ తాత, ఈవీవీ సత్యనారాయణ తండ్రి ఈదర వెంకట్రావు ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయస్సు ప్రస్తుతం 90 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అల్లరి నరేశ్ కుటుంబం తెలిపింది. ఈ క్రమంలోనే మంగళవారం స్వగృహంలో ఆయన తుదిశ్వాస వదిలారని పేర్కొంది.

పశ్చిమ గోదావరి జిల్లా కోరుమామిడిలో ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపింది. తమ తాతగారితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అల్లరి నరేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు వెంకట్రావు మృతికి సంతాపం తెలియజేస్తూ నివాళులు అర్పించారు.

కాగా, ఈదర వెంకట్రావు, వెంకటరత్నం దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె.. పెద్ద కుమారుడు ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ 2011 లోనే కన్నుమూశారు. ఈవీవీ సత్యనారాయణ తల్లి వెంకటరత్నం 2019 లో చనిపోయారు.
Allari Naresh
EVV Satyanarayana
Idara Venkatrao
Telugu cinema
Tollywood
Death
Korumamidi
West Godavari district
Family
Obituary

More Telugu News