Harish Rao: సిట్ విచారణకు వెళుతూ సీఎం రేవంత్ కు హరీశ్ రావు వార్నింగ్.. వీడియో ఇదిగో!
- తాటాకు చప్పుళ్లకు తాను భయపడబోనన్న హరీశ్
- న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని వ్యాఖ్య
- చట్టపరంగానే పోరాడుతామన్న మాజీ మంత్రి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటీసులకు, కేసులకు తాను భయపడబోనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు స్పష్టం చేశారు. సిట్ నోటీసుల మేరకు విచారణకు హాజరయ్యేందుకు వెళుతూ తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ.. తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని, రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే రేవంత్ రెడ్డికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని చెబుతూ.. కేసులపై చట్టపరంగానే పోరాడి తేల్చుకుంటామని స్పష్టం చేశారు.
కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోమారు విచారణకు రావాలంటూ హరీశ్ రావుకు సోమవారం సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో మంగళవారం ఉదయం హరీశ్ రావు సిట్ విచారణకు హాజరయ్యేందుకు ఎస్పీ ఆఫీసుకు వెళ్లారు. అంతకుముందు తెలంగాణ భవన్ కు వచ్చిన హరీశ్ రావుకు మద్దతుగా కార్యకర్తలు, పార్టీ నేతలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఎస్పీ కార్యాలయానికి బయలుదేరిన హరీశ్ రావు కారు వెంబడి పార్టీ నేతలు కూడా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.