Anant Singh: ఆసుపత్రిలో ఎమ్మెల్యే ధూమపానం... సర్వత్రా విమర్శలు
- పాట్నాలోని ఆసుపత్రిలో సిగరెట్ తాగిన ఎమ్మెల్యే
- వైద్య పరీక్షల కోసం వెళ్లినప్పుడు సిగరెట్ తాగిన ఎమ్మెల్యే
- వీడియోను పంచుకున్న ఆర్జేడీ అధికార ప్రతినిధి
జేడీ(యూ) ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఆసుపత్రిలో ధూమపానం చేస్తూ కనిపించారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన పాట్నాలోని ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఐజీఐఎంఎస్)కు వెళ్ళినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆయన తన అనుచరులు, సిబ్బందితో ఆసుపత్రి లోపలికి వస్తున్న సమయంలో బహిరంగంగా సిగరెట్ కాలుస్తూ కనిపించారు. ఈ సంఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆర్జేడీ అధికార ప్రతినిధి ప్రియాంక భారతి తన సామాజిక మాధ్యమ ఖాతాలో పంచుకున్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడైన అనంత్ సింగ్ సిగరెట్ పొగతో బీహార్‌లో సుపరిపాలనను తీసుకొస్తున్నారని ఆమె విమర్శించారు. గత ఏడాది ప్రశాంత్ కిశోర్ మద్దతుదారు దులార్‌చంద్ యాదవ్ హత్య కేసులో అనంత్ సింగ్ అరెస్టయ్యారు. అదే సమయంలో ఆయన మొకామా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.