Pooja Hegde: స్టార్ హీరో అసభ్యంగా ప్రవర్తించాడు.. షాకయ్యాను: పూజా హెగ్డే

Pooja Hegde Reveals Shocking Experience With Star Hero
  • తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని పంచుకున్న పూజా హెగ్డే
  • క్యారవాన్‌లోకి వచ్చిన స్టార్ హీరో అసభ్యంగా ప్రవర్తించాడని వెల్లడి
  • అతడిని లాగిపెట్టి కొట్టానన్న పూజా హెగ్డే

టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న పూజ హెగ్డే చేసిన తాజా వ్యాఖ్యలు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. తన కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టడంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. కెరీర్ మొదట్లోనే ఒక భారీ పాన్ ఇండియా సినిమాలో అవకాశం రావడంతో ఎంతో ఆనందంగా ఆ ప్రాజెక్ట్‌ను ఒప్పుకున్నానని పూజ తెలిపింది. కానీ షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె చెప్పింది.


షూటింగ్ జరుగుతున్న సమయంలో తన అనుమతి లేకుండానే ఆ సినిమాలో నటించిన స్టార్ హీరో తన క్యారవాన్‌లోకి వచ్చాడని పూజ వెల్లడించింది. అప్పటికే అది తనకు అసౌకర్యంగా అనిపించిందని, ఆ తర్వాత అతడు అసభ్యంగా ప్రవర్తించడంతో పూర్తిగా షాక్‌కు గురయ్యానని చెప్పింది. ఆ క్షణంలో ఏం చేయాలో అర్థం కాకపోయినా, చివరికి సహనం కోల్పోయి అతడిని లాగిపెట్టి కొట్టానని సంచలన వ్యాఖ్యలు చేసింది. అలా చేయగానే అతడు క్యారవాన్ నుంచి బయటకు వెళ్లిపోయాడని పూజ వివరించింది.


ఈ ఘటన తర్వాత ఆ హీరోతో కలిసి నటించాలనే ఆసక్తి పూర్తిగా పోయిందని, అందుకే తన సీన్స్‌ను డూప్‌తో షూట్ చేశారని తెలిపింది. అయితే ఆ హీరో ఎవరో మాత్రం ఆమె వెల్లడించలేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహిళా నటులు ఇండస్ట్రీలో ఎదుర్కొనే సమస్యలపై పూజ వ్యాఖ్యలు మరోసారి చర్చను రేపుతున్నాయి.

Pooja Hegde
Pooja Hegde interview
Tollywood
South Indian cinema
sexual harassment
me too movement
movie shooting experience
pan india movie
actress experience
controversy

More Telugu News