Peter Navarro: భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ట్రంప్ అడ్వైజర్ నవారో

Trump Advisor Peter Navarro Criticizes India on AI Services
  • ఇండియాలో ఏఐ సేవల కోసం అమెరికన్లు డబ్బు చెల్లిస్తున్నారని ఆరోపణ
  • ఏఐ డేటా సెంటర్ల వల్ల అమెరికాలో కరెంట్ చార్జీలు పెరిగాయని విమర్శ
  • ఆయా కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు పీటర్ నవారో మరోసారి భారత్ పై అక్కసు వెళ్లగక్కారు. భారతీయులు ఉచితంగా పొందుతున్న ఏఐ సేవలకు అమెరికన్లు మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఆయన ఆరోపించారు. చాట్ జీపీటీ వంటి ఏఐ కంపెనీలు అమెరికాలో తమ డేటా సెంటర్లు నెలకొల్పి భారత్, చైనా వంటి దేశాల్లో సేవలందిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.

ఈ కంపెనీల డేటా సెంటర్ల వల్ల అమెరికాలో విద్యుత్ చార్జీలు పెరిగిపోతున్నాయని, దీంతో అమెరికన్లపై ఆర్థిక భారం పడుతోందని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై ట్రంప్ ప్రభుత్వం దృష్టి సారించిందని, త్వరలో ఆయా కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోనుందని పీటర్ నవారో తెలిపారు. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌‌‌‌ అవుతున్నాయి.

కాగా, గతంలో కూడా పీటర్‌‌‌‌‌‌‌‌ నవారో పలుమార్లు భారత్‌‌ ‌‌పై అక్కసు వెళ్లగక్కారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను ప్రస్తావిస్తూ.. ఉక్రెయిన్ లో రష్యా చేస్తున్న మారణహోమానికి భారత్ పరోక్షంగా సాయం చేస్తోందని పీటర్ నవారో మండిపడ్డారు. ఆయిల్‌‌‌‌ రూపంలో భారత్‌‌‌‌ బ్లడ్‌‌‌‌ మనీ తీసుకుంటోందని ఆరోపించారు. ప్రపంచంలోనే అత్యధికంగా పన్నులు వసూలు చేసే దేశమంటూ భారత్ పై పీటర్ నవారో ఆరోపణలు చేశారు.
Peter Navarro
Donald Trump
India
United States
AI services
ChatGPT
Data centers
US electricity charges
Russia oil imports
Ukraine war

More Telugu News