Bandla Ganesh: చంద్రబాబు కోసం బండ్ల గణేశ్ పాదయాత్ర... నటుడు శివాజీ స్పందన
- చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు వేంకటేశ్వర స్వామికి మొక్కుకున్న బండ్ల గణేశ్
- మొక్కు తీర్చుకునేందుకు తిరుమలకు పాదయాత్ర
- పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి హాజరైన శివాజీ
- నమ్మిన వారిని గణేశ్ వదులుకోరన్న శివాజీ
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తిరుమలకు పాదయాత్రను ప్రారంభించారు. వైసీపీ హయాంలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానని, ఆ మొక్కును తీర్చుకునేందుకు సంకల్పయాత్ర పేరుతో తిరుమలకు పాదయాత్రగా వెళుతున్నానని చెప్పారు. మరోవైపు, బండ్లగణేశ్ పాదయాత్ర ప్రారంభ కార్యాక్రమానికి నటుడు శివాజీ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ... సామాన్యుడిగా వచ్చిన బండ్ల గణేశ్ ఒక బ్రాండ్ గా ఎదిగారని కొనియాడారు. చంద్రబాబు క్షేమంగా బయటకు రావాలని బండ్ల గణేశ్ మొక్కుకున్నారని... ఇప్పుడు మొక్కులు చెల్లించుకుంటున్నారని తెలిపారు. బండ్ల గణేశ్ తో తనకు 32 ఏళ్ల స్నేహబంధం ఉందని చెప్పారు. తనను నమ్మిన వారిని గణేశ్ ఎప్పుడూ వదులుకోరని తెలిపారు.