Rashmika Mandanna: జపనీస్ భాషలో మాట్లాడి అదరగొట్టిన రష్మిక

Rashmika Mandanna Wins Hearts Speaking Japanese in Japan
  • జపాన్‌లో పుష్ప 2 విడుదల 
  • అల్లు అర్జున్‌తో కలిసి వెళ్లిన రష్మిక
  • జపనీస్ భాషలో మాట్లాడి అభిమానుల మనసులు గెలుచుకున్న నటి
  • అభిమానులిచ్చిన గిఫ్టులు, లెటర్స్‌కు ఎమోషనల్ అయిన శ్రీవల్లి
  • తప్పకుండా మళ్లీ వస్తానంటూ జపాన్ ఫ్యాన్స్‌కు హామీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'పుష్ప 2: ది రూల్'. ఈ సినిమా జనవరి 16న జపాన్‌లో విడుదలైన సందర్భంగా ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్‌తో కలిసి రష్మిక అక్కడికి వెళ్లారు. ఈ పర్యటనలో ఆమె జపనీస్ భాషలో మాట్లాడి స్థానిక అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.

జపాన్‌లోని ఒక కార్యక్రమంలో పాల్గొన్న రష్మిక, అక్కడి వారి కోసం ప్రత్యేకంగా సిద్ధమై జపనీస్ భాషలో ప్రసంగించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన పర్యటనలో అభిమానులు చూపిన ప్రేమకు, ఆప్యాయతకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. "జపాన్.. మీరు ఎప్పుడూ నా హృదయాన్ని ఆనందంతో నింపేస్తారు. మీ అభిమానం, దయ ఎప్పటికీ మారవు. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మరింత కృతజ్ఞతతో తిరిగి వెళ్తాను" అని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు.

ఈ పర్యటనలో అభిమానులు తనకు ఇచ్చిన లెటర్స్, గిఫ్టులను చూసి రష్మిక తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వాటన్నిటినీ తనతో పాటు ఇంటికి తెచ్చుకుంటున్నట్లు తెలిపారు. "ఒక్క రోజులో ఇంత ప్రేమను అందుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. మీరిచ్చిన ప్రతీ బహుమతిని, లేఖను నేను చూశాను" అని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు.

అంతేకాదు, జపాన్‌కు మళ్లీ వస్తానని, ఈసారి ఎక్కువ రోజులు ఉంటానని అభిమానులకు ఆమె హామీ ఇచ్చారు. "తర్వాతిసారి వచ్చినప్పుడు మరింతగా జపనీస్ నేర్చుకుని వస్తానని ప్రామిస్ చేస్తున్నా" అని రష్మిక తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా టోక్యోలో జరిగిన ఈవెంట్‌లో అల్లు అర్జున్‌తో కలిసి ఆమె 'పుష్ప' ఐకానిక్ పోజ్ ఇవ్వడం విశేషం.
Rashmika Mandanna
Pushpa 2 The Rule
Allu Arjun
Japanese language
Japan promotions
Rashmika Japan visit
Tollywood
Indian cinema
Pushpa movie
Tokyo event

More Telugu News