Revanth Reddy: మేడారంలో ఆధునికీకరించిన గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy Inaugurates Modernized Gadde at Medaram
  • పైలాన్ ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి
  • కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతలు సమ్మక్క, సారలమ్మలకు పూజలు చేసిన ముఖ్యమంత్రి  
  • మేడారం గుడిని రూ.251 కోట్లతో అభివృద్ధి చేసిన వైనం
మేడారంలో ఆధునికీకరించిన గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అభివృద్ధి పనుల పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతలు సమ్మక్క, సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా తన మనవడితో కలిసి నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

త్వరలో జరగనున్న మేడారం మహా జాతర నేపథ్యంలో ప్రభుత్వం రూ.251 కోట్లతో ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులు చేసిన విషయం తెలిసిందే. 
Revanth Reddy
Medaram Jatara
Sammakka Saralamma
Telangana
Tribal Festival
Gadde
развитию
Mallu Bhatti Vikramarka
Telangana Government
Temple

More Telugu News