: యాదాద్రి జిల్లాలో పెద్దపులి సంచారం!

  • తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామ శివారులో లేగదూడను చంపేసిన పులి
  • భయందోళనలో పరిసర గ్రామాల ప్రజలు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పోలీస్, అటవీశాఖ అధికారులు
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో పులి సంచారం కలకలం రేపింది. మండల పరిధిలోని ఇబ్రహీంపూర్ గ్రామ శివారులో ఓ పొలం వద్ద లేగదూడపై పులి దాడి చేసి చంపేసిన ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనతో పరిసర గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచారం ఉన్న నేపథ్యంలో వీరారెడ్డిపల్లి, గంధమల్ల, ఎన్‌జీ బండల్, కోనాపూర్, ఇబ్రహీంపూర్ గ్రామాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అటవీ శాఖ అధికారులు సూచించారు. 
 
రాత్రి వేళల్లో పొలాల వైపు వెళ్లకుండా, పశువులను సురక్షితంగా ఉంచాలని హెచ్చరించారు. పులి కదలికలపై అటవీ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు సమాచారం.

More Telugu News