డీజీపీకి లేఖ రాసిన వైసీపీ
- డీజీపీ అపాయింట్‌మెంట్ కోసం లేఖ రాశామన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి
- భార్యను కలిసేందుకు పిన్నెల్లికి వచ్చిన వైసీపీ కార్యకర్త మంద సాల్మన్‌ను దారుణంగా కొట్టి హత్య చేశారని వెల్లడి
- టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువైందన్న లేళ్ల అప్పిరెడ్డి
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో వైసీపీకి చెందిన దళిత కార్యకర్త మంద సాల్మన్ ఇటీవల హత్యకు గురైన విషయం విదితమే. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీకి వినతిపత్రం సమర్పించాలని వైసీపీ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం (19వ తేదీ) తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డీజీపీకి లేఖ పంపారు.
ఊరు విడిచి బయట తలదాచుకుంటూ జీవిస్తున్న సమయంలో, భార్యను కలిసేందుకు పిన్నెల్లికి వచ్చిన మంద సాల్మన్‌ను ఇనుప రాడ్లతో దారుణంగా కొట్టి హత్య చేశారని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతగా దిగజారాయో చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువైందని, ముఖ్యంగా వైసీపీకి చెందిన దళిత కార్యకర్తలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారని ఆయన తెలిపారు. సాల్మన్ హత్య కేసులో దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరనున్నట్లు లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు.