Fake Currency: తెలంగాణలో భారీ ఎత్తున నకిలీ నోట్లు స్వాధీనం .. ముగ్గురు అరెస్టు

Fake Currency Racket Busted in Telangana 3 Arrested
  • ముగ్గురు నకిలీ నోట్ల ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నామన్న గుడిమల్కాపూర్ పీఎస్ ఇన్స్‌పెక్టర్ రాజు
  • రూ.42 లక్షల విలువైన రూ.500 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తయ్యాక వెల్లడిస్తామన్న సీఐ
నకిలీ కరెన్సీ నోట్లను సరఫరా చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.42 లక్షల విలువైన రూ.500 నోట్ల నకిలీ కట్టలను స్వాధీనం చేసుకున్నారు. గుడిమల్కాపూర్ ఇన్‌స్పెక్టర్ బైరి రాజు తెలిపిన వివరాలతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేతిబోలి సమీపంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్ వద్ద నకిలీ కరెన్సీ నోట్ల సరఫరా జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకుని దాడి నిర్వహించారు.

దాడిలో నకిలీ కరెన్సీని సరఫరా చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.42 లక్షల విలువైన రూ.500 నోట్ల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ నకిలీ కరెన్సీ సరఫరా వెనుక పెద్ద ముఠా ఉండే అవకాశం ఉందని, మరింత మంది ఈ నేరంలో భాగస్వాములై ఉండవచ్చని ఇన్‌స్పెక్టర్ బైరి రాజు తెలిపారు. ఈ కేసులో పూర్తి వివరాలను దర్యాప్తు పూర్తయ్యాక వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. 
Fake Currency
Telangana
Counterfeit Money
Gudimalkapur
Hyderabad
Crime News
Police Investigation
Currency Seizure
Fake Notes India
Byri Raju

More Telugu News