Nara Lokesh: తాతయ్య మీ జన్మ ధన్యం: ఎన్టీఆర్‌కు మంత్రి లోకేశ్ ఘన నివాళి

Nara Lokesh Pays Tribute to NTR on Death Anniversary
  • దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి నారా లోకేశ్
  • తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకం ఎన్టీఆర్ అని కొనియాడిన మంత్రి
  • పాత్రల ఫోటోలకు పూజలందడం తారకరాముడికి దక్కిన అరుదైన వరమని వ్యాఖ్య
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఘన నివాళులు అర్పించారు. తన తాతయ్యను స్మరించుకుంటూ ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకమని, ఆయనో మహానాయకుడని కొనియాడారు.

"తారక రాముడు పోషించిన పౌరాణిక పాత్రల ఫోటోలను ఇళ్లలో పెట్టుకొని ప్రజలు దేవుడిగా పూజిస్తుండడం ఎన్టీఆర్ గారికి మాత్రమే దక్కిన అరుదైన వరం" అని పేర్కొన్నారు. నటుడిగా, నాయకుడిగా ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు.

"మీరు భౌతికంగా దూరమై ఇన్నేళ్లయినా, తెలుగువారి హృదయాల్లో సజీవంగా ఉన్న తాతయ్యా.. మీ జన్మ ధన్యమయ్యా!" అంటూ లోకేశ్ తన సందేశాన్ని ముగించారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నాయి.
Nara Lokesh
NTR
Nandamuri Taraka Rama Rao
Telugu Desam Party
TDP
Andhra Pradesh
Former Chief Minister
Death Anniversary
Tribute
Telugu Pride

More Telugu News