Uddhav Thackeray: యుద్ధం ముగియలేదు... ఇప్పుడే ప్రారంభమైంది: ఉద్ధవ్ థాకరే
- ఈ గెలుపు ద్వారా తమను నిర్వీర్యం చేశామని బీజేపీ నేతలు భావిస్తున్నారన్న థాకరే
- బీజేపీ కుట్రలను త్వరలో బయటపెడతామని వ్యాఖ్య
- ముంబైలో శివసేన నుంచి మేయర్‌ను నియమించాలనేది తమ కల అన్న థాకరే
మహారాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయంతో తమను నిర్వీర్యం చేశామని భావిస్తున్న బీజేపీ నేతలకు అది ఎప్పటికీ సాధ్యం కాదని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. యుద్ధం ఇప్పుడే మొదలైందని, ఇది ముగింపు కాదని ఆయన ఉద్ఘాటించారు. బీజేపీ కుట్రలను త్వరలోనే బయటపెడతామని అన్నారు. ముంబైలో శివసేన (యూబీటీ) నుంచి మేయర్‌ను నియమించాలనేది తన కల అని, అదే నెరవేరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని ఆకాంక్షించారు.
స్థానిక ఎన్నికల్లో అవకతవకలు జరగడం వల్లే బీజేపీ గెలుపొందిందని ఉద్ధవ్ థాకరే ఆరోపించారు. కుట్రపూరితంగా, అక్రమంగా విజయం సాధించిందని దుయ్యబట్టారు. ముంబైని పూర్తిగా తాకట్టు పెట్టాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల్లో తమ పార్టీ 64 స్థానాలను కైవసం చేసుకుందని గుర్తు చేశారు. 227 స్థానాలున్న బీఎంసీలో బీజేపీ 89 స్థానాలు, శివసేన (షిండే) 27 స్థానాలు, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 64 స్థానాల్లో విజయం సాధించాయి.