Govinda: గోవిందాపై భార్య సునీత తీవ్ర వ్యాఖ్యలు!
- గోవిందా, సునీత విడాకుల గురించి జోరుగా పుకార్లు
- గోవిందా మూర్ఖుడు అన్న సునీత
- ఆయనను ఎప్పటికీ క్షమించను అని వ్యాఖ్య
బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా, అతని భార్య సునీత మధ్య గత ఏడాది నుంచి విడాకుల పుకార్లు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా గోవిందా అక్రమ సంబంధాలు కారణం అంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల సునీత ఒక పాడ్‌కాస్ట్‌లో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మిస్ మాలిని పాడ్‌కాస్ట్ ప్రోమోలో సునీత మాట్లాడుతూ, గోవిందాను ఉద్దేశించి "గోవిందా మూర్ఖుడు. నీకు 63 ఏళ్లు వచ్చాయి. కూతురు టీనా పెళ్లి చేయాలి. కొడుకు యష్ కెరీర్ గురించి ఆలోచించాలి. నిన్ను నేను ఎప్పటికీ క్షమించను" అని అన్నారు. కుటుంబ బాధ్యతల విషయంలో కూడా సునీత అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కొడుకు యష్‌వర్ధన్ కెరీర్‌లో గోవిందా ఏమాత్రం సహాయం చేయడం లేదని, "నువ్వు తండ్రివేనా?" అని ఆయన ముఖం మీదే అడిగానని చెప్పారు. 1987లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు టీనా, యష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి విడాకుల రూమర్స్ స్టార్ట్ అయ్యాయి.